కాసిపేట : కాసిపేట (Kasipeta ) మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు ( Disabled children ) శనివారం మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు. ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా ఎంపికైన ప్రత్యేక అవసరాల దివ్యాంగ పిల్లలకు ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ మండలంలోని ప్రత్యేక అవసరాల దివ్యాంగ పిల్లల వైకల్య నిర్ధారణ కోసం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ శిబిరాలలో ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తించి వివరాలు పంపించగా పలువురు ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ శ్రీలత, తల్లిదండ్రులు పాల్గొన్నారు.