దస్తూరాబాద్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు కోట వేణు ( HM Kota Venu ) విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను( Note Books) పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ఎంపీడీవో రమేశ్, ఎంఈవో టీ. గంగాధర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం విద్యార్థుల మేలు కోసం ఆలోచించే ప్రధానోపాధ్యాయుడు వేణు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నోట్ బుక్స్ ను అందజేసిన దాత హెచ్ ఎం కోట వేణు ను అభినందించారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు కోమురయ్య, లావణ్య, వెన్నెల, శరీన్, సురేందర్ బాబు, సీఆర్పీతిరుపతి, ఐఆర్పీలు జగన్, ఉదయ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.