ఎదులాపురం, మే 13 : మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాయిబాబా లాడ్జి యజమాని కుమారుడు వట్టంవార్ వెంకటేశ్ రణదీవ్నగర్కు చెందిన తోకల దేవేందర్ (వాటర్ ప్లాంట్ వ్యాపారి)కి వార్డు కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తానంటూ రూ.12.50 లక్షలు దశలవారీగా డబ్బులు తీసుకున్నాడు.
మోసపోయానని తెలుసుకుని దేవేందర్ ఫిబ్రవరి 8, 2025లో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి తప్పించుకూ తిరుగుతున్న వెంకటేశ్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు.