ఎదులాపురం, మే 5 : ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టిస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ.1.70 కోట్ల మేర మోసం చేసిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించా రు. విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సల్మాన్ అలియాస్ సోలోమన్ రాజ్ ని జామాబాద్కు చెందిన గుడూరు ఉమారాణి ని నమ్మించి భారీగా నగదు కొల్లగొట్టాడు.
విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తున్నానని నమ్మబలికి వ్యక్తిగత అవసరాల పేరిట రూ.2 లక్షలు తీసుకొని తిరిగి చెల్లించాడు. అనంత రం 2022లో ట్రేడింగ్లో పెట్టుబడులు పెడి తే లాభాలు వస్తాయని చెప్పి, ఆమె పేరిట ఖాతా తెరిపించి పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు.
ఫిర్యాదుదారు తన పరిచయస్తుల వద్ద నుండి సుమారు రూ.1.40 కోట్లు అప్పు గా తీసుకొని నగదు బ్యాంక్ మార్గాల్లో నిందితుడికి ఇచ్చింది. అదనంగా, తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మరో రూ.30 ల క్షలు వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని విడుతలుగా ఆన్లైన్ ద్వారా ఆదిలాబాద్ విద్యానగర్లోని అతని కార్యాలయంలో చెల్లించినట్లు ఫిర్యాదు చేసింది. మొత్తం కలిపి సుమారు రూ.1.70 కోట్లు తీసుకున్నప్పటికీ, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు ఉద్యోగం కూ డా ఇప్పించకుండా మోసం చేసి తప్పించుకుంటున్నాడని బాధితురాలు ఆరోపించింది.