కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipeta ) మండలంలోని వరిపేట శివారు, కన్నాల పరిధిలో ఉన్న బుగ్గ చెరువు మత్తడిలో ( Stream ) చిక్కుకున్న యువకులను స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. శనివారం మధ్యాహ్నం బుగ్గగూడెంకు చెందిన యువకులు ( Youth ) మార్నేని సంజీవ్, మార్నేని సంతోష్, మార్నేని సాగర్, బద్ది అరుణ్, ఏదుల శశికుమార్ బుగ్గ చెరువు మత్తడి వాగు ప్రవాహం తక్కువగా ఉండడంతో చేపలు పట్టేందుకు అవతలి ఒడ్డుకు వెళ్లారు.
ఈ క్రమంలో పైన కురిసిన వర్షాలకు మత్తడి వాగు ఉధృతి పెరిగింది. దీంతో మొదటి మత్తడి దాటిన యువకులు అటు వైపు కొంత దూరంలో రెండో మత్తడి ఉండడంతో మధ్యలో అలాగే ఉండి పోయారు. మార్నేని సంతోష్ అనే యువకుడు ప్రమాదపు అంచున వాగు దాటగా మిగతా నలుగురు అక్కడే ఉండిపోయారు. స్థానిక రైతులు గమనించి వరద పెరుగుతుండడంతో తాళ్ల సాయంతో ఒక్కోక్కరిని వాగు ప్రవాహం నుంచి దాటించి ఒడ్డుకు చేర్చారు. ఎట్టకేలాగు గంట సేపు ప్రయత్నించి వారిని భయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.