కుభీర్, ఆగస్టు 31: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి బీ గ్రామానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తీర్థయాత్రకు వెళ్లిన వీరు సోమవారం మహారాష్ట్రలోని తొటంబ వద్ద జీపు బోల్తా పడిన ఘటనలో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను జీపు డ్రైవర్ తులసిరాం (29), పార్ఢీబి గ్రామానికి చెందిన డ్రైవర్ తులసిరాం పటేల్ (28), తూము సాయిలు (65), ఆవుల గంగాధర్ (64), తూమ్(పున్లికోల్ల) గౌరబాయి(75)లుగా గుర్తించారు.
తొటంబ ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 14 మంది ప్రయాణిస్తున్నారు. జీపు బోల్తా పడి నలుగురు మరణించగా. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా వీరిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దైవదర్శనానికి వెళ్లి.. నలుగురు మృత్యువాత పడడంతో పార్డి బీ గ్రామంలో విషాదం నెలకొంది.