ఉట్నూర్: ఉట్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన యువ నాయకుడు తిత్రే జైసింగ్ ( Jaisingh ) ఇటీవల నాగాపూర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ( Hospital ) చేర్పించి చికిత్స అందిస్తున్నారు. . విషయం తెలుసుకున్న ఉట్నూర్ మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్ సోమవారం ఆసుపత్రికి వెళ్లి జైసింగ్ ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జైసింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.