నార్నూర్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను ఎర్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ( Rathod Janardhan ) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు విషయాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
రాబోవు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల పనిచేయాలని, సర్పంచ్, జడ్పీటీసీ , ఎంపీటీసీ గెలుపు కోసం దిశా నిర్దేశం చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.