శ్రీరాంపూర్, మే 10 : తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీరాంపూర్ కాలనీ బ్యాంక్ గ్రౌండ్ నుంచి బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. శ్రీరాంపూర్ కాలనీ, ఆర్కే 6 గుడిసెలు, కృష్ణాకాలనీ, ఆర్కే6 కాలనీ మీదుగా సీసీసీ టౌనౌషిప్, సుందరయ్య నగర్, షిర్కే గోదావరికాలనీ, నాగార్జునకాలనీ, నస్పూర్ కాలనీ మీదుగా సీసీసీ కార్నర్, విలేజ్ శ్రీరాంపూర్ నుం చి శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వరకు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని తీర్మానించుకున్నారని చెప్పారు.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమైందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుంట జగ్గయ్య, రాజేశం, టీబీజీకేఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, కౌన్సిలర్లు మాజీ చైర్మన్ ఇసంపెల్లి, ప్రభాకర్, వంగ తిరుపతి, పంబాల గంగాఎర్రయ్య, బేర సత్యనారాయణ, హైమద్, జనార్దన్, టీబీజీకేఏస్ కేంద్ర కమిటీ నాయకులు కే సురేందర్‌రెడ్డి, పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి, రఫీక్‌ఖాన్, గోపతి తిరుపతి, రవిగౌడ్, ఎల్లయ్య, గర్సె రామస్వామి, భీమయ్య, దగ్గుల మధు, కాటం రాజు, ప్రశాంత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేసిందని, ఏ ఒక్క హామీనీ అమలు చేసింది లేదని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియా 3 వార్డు, ఆర్కే 6 కాలనీ, 4వ వార్డు కృష్ణాకాలనీలో కౌన్సిలర్ పంబాల గంగా ఎర్రయ్య, పట్ణణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్యతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.
దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలపించాలని కోరారు. మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, జక్కుల రాజేశం, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, ఎస్సీ సెల్ పట్టణ ఆధ్యక్షుడు గరిసె రామస్వామి, కౌన్సిలర్లు వంగ తిరుపతి, మాజీ ఎంపీటీసీ గుమ్మడి శ్రీనివాస్, రాయలింగు, నాయకులు గరిసె భీమయ్య, మోహన్, కాటం రాజు, తిరుమల్‌రావు, బింగి రాజేశం, కొల్లూరి తిరుపతమ్మ, తిరుమల, స్వప్న పాల్గొన్నారు.