ఎదులాపురం, మే 29 ః ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిచ్చి ముదిరినట్లుగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్నం బ్రిడ్జి టెండర్లతోపాటు, రూ.40 కోట్ల రోడ్డు సౌకర్యం, జైనథ్ సబ్ స్టేషన్ మంజూరు, జేఎన్టీయూ కాలేజీ వంటి పనులను సాంక్షన్ చేయించినప్పుడు పాయల్ శంకర్ ఎకడున్నారో గుర్తు చేసుకోవాలని మండిపడ్డారు.
దమ్ముంటే ఆదిలాబాద్‌కు విమానాశ్రమం, జేఎన్టీయూ కాలేజ్ సబ్‌స్టేషన్‌తోపాటు, ఆర్మూర్ రైల్వేలైన్ పనులు పూర్తిచేయడంలో చిత్తశుద్ధి చూపించాలని హితువు పలికారు. ఉపాసనాల ఫోర్‌లేన్ రోడ్లు భోరజ్ వరకు ఎందుకు రాదని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 20 కిలో మీటర్ల దూరంలోనే ఇంత వివక్ష చూపుతున్నప్పుడు, బీజేపీ ఎమ్మెల్యేగా ఆదిలాబాద్‌లో చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.