దండేపల్లి, మార్చి 17 : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అజ్మీర గోవింద్‌నాయక్ అంత్యక్రియలు మం గళవారం ముగిశాయి. ఆయన స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్‌లో అంతిమయాత్ర నిర్వహించగా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ మంత్రులు తాటిపత్రి జీవన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్‌నాయక్, సీనియర్ నాయకులు రవీందర్రావు, శ్యాంనాయక్, నరేశ్‌జాదవ్, రితీశ్‌రాథోడ్, బీఆర్ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు అంతిమయాత్రలో పాల్గొని, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. వివాదాలకు దూరంగా ఉండి అందరితో సన్నిహితంగా మెలిగేవారన్నారు. ఆయన అకాల మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పసర్తి అనిల్, అజయ్‌గౌడ్, సుధాకర్, అంజన్న పాల్గొన్నారు.