ప్రకృతి ఒడిలో పల్లె పార్కు
ఎత్తైన గుట్టలు... పక్కనే మిషన్ కాకతీయ చెరువు.. పక్షుల కిలకిలరావాలు.. వీటి మధ్య పల్లె పార్కు చూడముచ్చటగా ఉంది. వివిధ రకాల రంగు రంగుల పూల మొక్కలు, చెట్లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు.. చిన్న చిన్న రాళ్లతో ఆకర్షణీయంగా గీసిన చిత్రాలు, ఆట వస్తువులు, వన్య ప్రాణుల ప్రతిమలు, పండ్ల మొక్కలతో
- చుట్టూ గుట్టలు… మధ్యలో చెరువు
- వన్నె తెస్తున్న పూలు, పండ్ల మొక్కలు
- ఆహ్లాదం పంచుతున్న పరిసరాలు
- చూడ ముచ్చటగా ఇచ్చోడ ప్రకృతి వనం
ఇచ్చోడ, ఆగస్టు 24: ఎత్తైన గుట్టలు… పక్కనే మిషన్ కాకతీయ చెరువు.. పక్షుల కిలకిలరావాలు.. వీటి మధ్య పల్లె పార్కు చూడముచ్చటగా ఉంది. వివిధ రకాల రంగు రంగుల పూల మొక్కలు, చెట్లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు.. చిన్న చిన్న రాళ్లతో ఆకర్షణీయంగా గీసిన చిత్రాలు, ఆట వస్తువులు, వన్య ప్రాణుల ప్రతిమలు, పండ్ల మొక్కలతో అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇచ్చోడ తండా సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి వనం సిటీ పార్కును తలపిస్తోంది.
పాలక వర్గం…ప్రజాప్రతినిధుల కృషితో…
మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, స్థానిక ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, పాలక వర్గం, పంచాయతీ సిబ్బంది కృషితో పల్లె ప్రకృతి వనం అ ద్భుతంగా తయారైంది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జి ల్లా, మండల ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఇచ్చోడ జీ పీకి రెండున్నర కిలో మీటర్ల దూరంలో సుమారు ఎకరన్నర స్థలంలో రూ. 5 లక్షల నిధులతో ప్రకృతి వ నాన్ని ఏర్పాటు చేశారు. నిధులు సరిపోకపోవడంతో జీపీ ని ధులు రూ. 8 లక్షలు వెచ్చించారు.
పర్యాటకుల సందర్శన కోసం చక్కని రోడ్డును నిర్మించారు. పార్కులో మొక్కల సం రక్షణ కోసం చుట్టూ ఐదు ఫీట్ల ఎత్తుతో జాలీ కంచెను ఏ ర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోరుబావిని తవ్వించి, అం డర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా చెట్లకు నీటిని అందిస్తున్నా రు. హైదరాబాద్ నుంచి మామిడి, జామ, అల్లనేరేడు, కొబ్బరి మొక్కలు తీసుకువచ్చి నాటారు. రా త్రి వేళలో సుందరంగా కనిపించేలా మధ్యలో రెండు స్తంభాలకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశా రు. ప్రత్యేకంగా వాచ్‌మన్‌ను నియమించారు. వేసవి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి చిన్నారులు, యువతీయువకులు తరలివస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

