కాగజ్నగర్/దహెగాం, జూన్ 23 : పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని లోడుపల్లి, కొండపల్లి అభయారణ్యాన్ని జీవవైవిధ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని కవ్వాల్ టైగర్ జోన్ సీసీసీఎఫ్ శాంతరాం అన్నారు. ఆదివారం లోడుపల్లి సెక్షన్, కొండపల్లి సౌత్ బీట్ కంపార్ట్మెంట్ నం.151లోని వృక్ష శిలాజాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెరెక్టర్, డాక్టర్ మంజుషా, సీనియర్ జియోలాజిస్ట్ చక్రవర్తితో కలిసి పరిశీలించారు.
శిలాజాలు ఎలా ఏర్పడ్డాయి, ఎప్పుడు ఏర్పడ్డాయి అన్న అంశంపై చర్చించారు. అలాగే రకరకాల చెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో సుధాకర్, డిప్యూటీ ఎఫ్ఆర్వో ప్రభాకర్, ఎఫ్బీవో మహేశ్ పాల్గొన్నారు.