Kasipeta | భక్తుల సౌకర్యార్థం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగింపు
Kasipeta | మహా శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు వచ్చే మార్గంలో ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను పంచాయతీ అధికారులు తొలగించారు.
కాసిపేట : మహా శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు వచ్చే మార్గంలో ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను పంచాయతీ అధికారులు తొలగించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipeta ) మండలం కోమటిచేను గ్రామ పంచాయతీ పరిధిలోని వరిపేట శివారు మీదుగా శివాలయం వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా పిచ్చి మొక్కలు భారీగా పెరిగాయి.
ఈ కారణంగా ఆలయానికి వచ్చే భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై పెరిగిన పిచ్చి మొక్కలను సోమవారం జేసీబీ ( JCB ) తో పూర్తిగా తొలగించి రాకపోకల సమస్యను పరిష్కరించారు. సర్పంచ్ జాడి మాణిక్య శంకరయ్య, ఉప సర్పంచ్ కొడప అనంత రావు, వార్డ్ సభ్యులు సరోజ, గుండేటి నర్సయ్య, న్యాయవాది, నాయకులు మాసు సుధాకర్, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దుర్గం గణేశ్, శంకర్, నరేష్, తదితరులు పనులను పరిశీలించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

