దస్తురాబాద్, మార్చి 5 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గ్రామంలో రెండో రోజు ఆదివారం ఐఎస్ఎస్, ఐఈఎస్ శిక్ష ణ అధికారులు పర్యటించారు. ఇందులో భాగం గా ఇంటింటికీ తిరుగుతూ ఆర్థిక, సామాజిక స్థితిగతులు, తాగు, సాగు నీరు, వనరులు, మిషన్ భగీరథ పథకం గురించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామస్తులతో రచ్చబండ కా ర్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య వివరాలు, హెల్త్ సెంటర్, బీపీఎల్ కుటుంబాల గురించి, రే షన్ కార్డులు, ఒంటరి మహిళలు, వితంతువు లు, పెన్షనర్లు, వంద రోజుల పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీని సందర్శించా రు. ఈ కార్యక్రమంలో శిక్షణ అధికారులు సందీపన్ సర్కార్, బంటి కుమార్, ఆలీషా ఖాన్, ప్రీతం సేన్, సౌమ్య బుదిరాజా, సర్పంచ్ బొడ్డు గంగన్న, తహసీల్దార్ చిన్నయ్య, ఎంపీడీవో లింబాద్రి, ఎంపీవో వెంకటేశ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మామడ మండలం కమల్‌కోట్‌లో..
మామడ, మార్చి 5 : మండలంలోని కమల్‌కోట్ గ్రామంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి విలేజ్ స్టడీ ప్రోగ్రాంలో భాగంగా ఆలిండియా సివిల్ సర్వీసెస్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా మండల అధికారులు, గ్రామస్తులు వారి కి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రజల జీవనవిధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, వాటి అమలు తీరును తెలుసుకున్నారు. గ్రామంలో సాగు చేసే పంటలు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, నర్సరీ, ఉపాధిహామీ పనులు, హరితహారం తదితర వాటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అధికారులు మన్వేంద్ర సింగ్, సోనక్య సమాందర్, విపిన్‌సింగ్, అర్కమాండల్, దిప్షిక యాదవ్, ఎంపీడీవో రమేశ్, సర్పంచ్ రావుల ముత్యంరెడ్డి, ఎంపీటీసీ బొజ్జ రాధ, ఎంపీవో గోవర్ధన్, ఏపీవో శివాజీ, పంచాయతీ కార్యదర్శులు రాజేశ్వర్‌రెడ్డి, సురేశ్, అజిత, సాయికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద మండలం పార్‌పెల్లిలో..
లక్ష్మణచాంద, మార్చి 5 : మండలంలోని పార్పెల్లి గ్రామానికి వచ్చిన శిక్షణ ఐఈఎస్, ఐఎస్ఎస్ అధికారులు గ్రామంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఉదయం సర్పంచ్ నూకల రా జేందర్తో కలిసి గ్రామం మొత్తాన్ని పరిశీలించా రు. పలు అంశాలపై గ్రామస్తులను వివరాలు అ డిగారు. గ్రామంలో ఇటీవల చేపట్టిన గ్రామాభివృద్ధి పనులను పరిశీలించారు. వారివెంట పం చాయతీ కార్యదర్శి సౌజన్య, గ్రామస్తులున్నారు.