ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా ఇంద్రవెల్లి మండలం సాత్వాజిగూడ వాగులో ఘోర ప్రమాదం ( Accident) తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో వాగులో బోల్తా పడడంతో ప్రయాణికులు ( Passengers) సురక్షితం బయటపడ్డారు. ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి బుస పటం మధ్య ఉన్న సత్వాజిగూడ వద్ద వాగు పొంగి పొర్లుతుంది.
బుధవారం మధ్యాహ్నం పదిమంది ప్రయాణికులతో వెళుతున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో వాగును దాటించే ప్రయత్నం చేస్తుండగా నీటి ప్రవాహానికి ఆటో వాగులో పడిపోయింది. గమనించిన స్థానికులు, ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆటోను జేసీబీ, పోలీసుల సహాయంతో బయటకు తీశారు. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, వంతెనల వద్ద ప్రమాదకరంగా ప్రయాణించి ప్రమాదాలకు లోనుకావొద్దని పోలీసులు గ్రామస్థులకు సూచించారు.