‘కాంగ్రెసోళ్లు ఎైట్లెనా ఎన్నికల్లో గెలవాలని 24 గంటల కరెంట్‌పై కుట్రలు చేస్తున్నరు. తప్పుడు హామీలు ఇస్తున్నరు. ఎవుసానికి మూడు గంటలు కరంట్ చాలంటున్నరు. గట్లయితే పంట ఎట్లా తీసుడో చెప్పాలె. గట్టిగ మాట్లాడితే.. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టమంటున్నరు. రైతులు గంత పెద్ద మోటర్లు వాడుతరా..? వాడితే ఇప్పుడు పెట్టిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా..? పైపులైన్లు సరిపోతయా? గా ఖర్చులన్నీ ఎవ్వడియ్యాలె. నెల రోజుల్లోనే మూడు మాటలు మాట్లాడిన్రు. నిజానికి ఇప్పుడు మాకు కావాల్సినంత కరెంటు ఉంది. రంది లేకుంట ఎవుసం చేసుకుంటున్నం. నాటి బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నం. మీ పాలన వద్దని బండకేసి కొట్టిన కూడా బుద్ధిరాలె. ఇప్పుడు మళ్లచ్చి పూటకో మాట మాట్లాడి మా బతుకులు ఆగం జేయాలని చూస్తున్రు.’ అని రైతులు హస్తం పార్టీపై మండిపడుతున్నారు. మళ్లోసారి నమ్మి మోసపోయే ప్రసక్తే లేదని, మా బతుకులకు భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ సర్కారునే మళ్లీ గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
– ఆదిలాబాద్ /నిర్మల్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ)
నా పేరు సప్నిల్. మాది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని హస్నాపూర్. నేను ఎవుసం చేస్తా. నాకు ఐదెకరాల భూమి ఉంది. బావికి 3 హెచ్‌పీ మోటరు పెట్టి నీరు పారిస్తా. 24 గంటల కరెంటు ఉండడంతో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి చేలకు నీరు పెడుతున్న. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు ఇస్తే ఎలా సరిపోతది. ఇంకా 10 హెచ్‌పీ మోటరు పెడుతరని అంటున్నరు. ఒక్కో మోటర్ కొనాలంటే లక్ష రూపాయలు అవుతయి. ఈ ఖర్చంత ఎవరు భరిస్తరు. సరే.. ఒక్కటేసారి ఈ మోటర్లతో నీటిని తోడితే భూమి లోపల నీరు అయిపోతది. మళ్లీ ఊరడానికి చాలా సమయం పడుతది. అప్పటివరకు పంటలు ఎండిపోయి, నష్టపోవాల్సి వస్తది. ఇంకా.. ట్రాన్స్ఫార్మర్ మీద భారం పడి పేలిపోవడంతోపాటు కొన్ని సందర్భాలలో సబ్‌స్టేషన్ కూడా కాలిపోయే ప్రమాదం ఉంది. మాకు మాత్రం 24 గంటల కరెంటే కావాలి.. మా కేసీఆరే మళ్లీ సీఎం కావాలి.
దిలావర్పూర్, నవంబర్ 20 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులను తీసుకొవచ్చేందుకు కుట్ర పన్నుతున్నది. కేసీఆర్ సీఎం అయిన తరువాత 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నడు. మా బతుకులు బాగుండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మూడు గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్లను పెట్టిస్తామని చెబుతున్నది. మూడు గంటల కరెంట్‌తో నాకున్న ఐదెకరాల భూమిలో మూడు గుంటలు కూడా పారదు. 10 హెచ్ పీల మోటర్లు పెడితే ఉన్న ట్రాన్స్పార్మర్ పేలి మోటర్లు కాలిపోయి పంటలు ఎండి పోతాయి. రైతులు రోడ్డెక్కి కరెంట్ కోసం ధర్నాలు చేయాల్సి వస్తది. కాంగ్రెస్ పాలన లో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రు. పాత రోజులు తీసుకొచ్చేం దుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం వల్ల 24 గంటల కరెంట్‌తో పంటను మంచిగ పండించుకుంటున్నం. మా బతుకులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయ్.
– నంద ముత్యం, రైతు, దిలావర్పూర్.
ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని తప్పుడు హామీలు.. ఝూటా మాటలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నాయకుడు ధరణి పోర్టల్‌ను తీసివేస్తామని, మరొకడు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని.. మూడు గంటలే సరిపోతుందని, 10 హెచ్‌పీ మోటర్లు వాడాలని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ 24 గంటల కరంట్‌తో వ్యవసాయాన్ని పండుగలా మార్చగా.. హస్తం పార్టీకి కళ్లు మండుతున్నాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, ధరణి పోర్టల్లాంటివి అమలు చేస్తుండగా, ఈ పథకాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పథకాలు అమలు తీసుకొస్తామంటూ మోసపూరితమైన మాటలు చెబుతుండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
నిరంతరాయంగా అందుతున్న కరంటుతో రైతులు మూడు పంటలు పండించుకొని ఆర్థికంగా బలపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా రైతులంతా పంట పొలాల్లోనే కాపు కాసేవారు. అర్ధరాత్రి కరంటు కోసం వెళ్లి అనేక మంది రైతులు పాము కాటుకు గురై మరణించిన ఘటనలు అనేకం. కరంటు కోసం రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత వ్యవసాయ స్వరూపమే మారిపోయింది. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తిగడించింది. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు కుట్రలకు దిగుతున్నారు. కాంగ్రెసోళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. వారి ఝూటా మాటలను ఎవరూ నమ్మరని, 24 గంటల కరంటు ఇచ్చే బీఆర్ఎస్ సర్కారునే మళ్లీ గెలిపించుకుంటామని భూమి పుత్రులు స్పష్టం చేస్తున్నారు.
– ఆదిలాబాద్/నిర్మల్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ)
తాంసి, నవంబర్ 20 : 24 గంటల ఉచిత కరెంటుతో పసిడి పంటలు పండిస్తు న్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్‌పీ మోట ర్లు వాడరు అనే విషయాన్ని గుర్తించాలే. రేవంత్‌రెడ్డి అలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం సరికాదు. నాకు ఎనిమిదెకరాల భూమి ఉంది. ఇందులో వరి వేస్తాను. రెండు, మూడు రోజులకోసారి నీరు పారిస్తా. అవసరమైతే వీలున్న సమయంలో నేను పొలానికెళ్లి నీరు పెడతా. నాకు 5 హెచ్‌పీ మోటరుతో పంటలకు సరిపడా నీరందిస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెసోళ్లు ఓట్ల కోసం ఇలా రైతులతో రాజకీయం చేస్తున్నారు. వ్యవసాయం మీద అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల పని, వారి అవసరాలు ఎలా తెలుస్తయ్. అందుకే 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వానికే అండగా ఉంటాం.
– సంజీవరెడ్డి, యువరైతు, ఖోడద్, తలమడుగు మండలం.
దస్తురాబాద్, నవంబర్ 20 : కాంగ్రెస్ హయంలో కరెంట్ కోతతో అవస్థలు పడ్డాం. ఎకరం, రెండెకరాలు పారుడే కష్టంగా ఉండేది. 24 గంటల కరెంట్ ఇస్తే 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లతో నీరు పారుతున్నది.10 హెచ్‌పీ మోటర్లకు ఖర్చు ఎక్కువ అవుతది. బోర్లు ఎండిపోయే పరిస్థితి వస్తది. కాంగ్రెస్ నాయకుల మాటలు సరైనవి కావు. 3 గంటల కరెంట్ ఇస్తే పొలాలకు నీళ్లు సరిపోక పంటలు ఎండిపోతాయి. కరెంట్ కష్టాలు మళ్లీ మొదలైతయ్. రైతులు ఇబ్బంది పడి ఆగం అయ్యే ప్రమాదం ఉన్నది.
– సింగరి రాజన్న, రైతు, భూత్కుర్.
ముథోల్, నవంబర్ 20 : రైతులకు ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటుతో నే సంతోషంగా ఉన్నాం. పంటలు కళకళలాడుతు న్నాయి. కాంగ్రెస్‌లో 3 గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టమనడం సిగ్గుచేటు. దీంతో రైతులపై భారం పడుతది. రైతులు పూర్తిస్థాయిలో నష్టపోతారు. మళ్లీ తెలంగాణ వందేళ్ల వెనక్కి వెళ్తది. రాత్రుల్లో మోటర్ల దగ్గర ఉండే పరిస్థితి వస్తది. తెలంగాణ లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి, మా ఇబ్బందులు దూరమవుతాయి.
– సాయిలు, బ్రహ్మణ్గావ్, ముథోల్.
బజార్హత్నూర్, నవంబర్ 20 : కాంగ్రె సోళ్లు రైతన్నలను తప్పు పట్టిస్తున్న రు. మూడు గంటల కరెంటే చాలని రేవంత్‌రెడ్డి చిల్లరగా మాట్లాడడం సరికాదు. 10 హెచ్‌పీ మోటర్తో మూడు గంటల్లో పొలానికి నీరు పారించవచ్చని చెప్పడం అవివేకం. రేవంత్‌రెడ్డికి వ్యవసాయం చేస్తే తెలుస్తది. 10 హెచ్‌పీ మోటర్లు వ్యవసాయానికి వాడుతరో లేదో కూడా తెలియని పరిస్థితి వారిది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కో సం సానా గోసపడ్డం. అర్ధరాత్రి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టేది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో మా కష్టా లు తీరాయి. మొదట సోయా తర్వాత ధనియాలు ఆ తర్వాత జొన్న పంట వేస్తా.
– గాండ్ల రమేశ్, రైతు, బజార్హత్నూర్.
దిలావర్పూర్, నవంబర్ 20 : కాంగ్రెసోళ్లు ఏ ఊరికి వెళ్లినా మూడు గంటల కరెంటు ఇస్తామని, 10 హెచ్‌పీ మోటర్లు వాడితే సరిపోతాయని చెబుతున్నరు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఎప్పుడిస్తారో తెలియదు. మూడు గుంటల భూమి కూడా పారదు. తమ వద్ద ఉన్న 5 హెచ్‌పీ మోటర్లను తీసేసి 10 హెచ్‌పీ మోటర్లు పెడితే ఆర్థిక భారం పడుతది. రైతులందరు కలిసి ఇచ్చిన మూడు గంటల్లోనే మోటర్లను ఆన్ చేస్తే సమీపంలో ఉన్న ట్రాన్స్పార్మర్ పేలిపోతుంది. ఇలా చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతులకు చేటు అవుతది. మా బతుకులు ఆగం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది.
– చంద్రశేఖర్, రైతు, గుండంపల్లి.
మా కుటుంబానికి 16 ఎకరాల భూమి ఉన్నది. మేము వ్యవసాయ బావి నీటిని 5 హెచ్‌పీ మోటర్తో నీళ్లు ఇచ్చుకుంటు న్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌తో మేలు జరుగుతున్నది. భూమి విస్తీర్ణం ఎక్కువ ఉన్నా కూడా మాకు 10 హెచ్‌పీ మోటర్ అవసరం రాలేదు. గతంలో కరెంట్ సమస్యతో, నీటి సమస్యతో పంటలు పండక అప్పులే మిగేలేవి. తెలంగాణ వచ్చాక దిగుబడులు పెరిగి, ఆర్థికంగా నిలదొక్కుకు న్నాం. ఈ ఏడాది 200 క్వింటాళ్ల వరకు పత్తి, 20 క్వింటాళ్ల సోయా, 30 క్వింటాళ్ల జొన్నలు, 10 క్వింటాళ్ల కందులు వస్తా యని భావిస్తున్నాం. అలాగే రెండెకరాల్లో మిర్చి కూడా బాగున్న ది. మొత్తానికి ఇప్పుడు ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వస్తున్నది. రైతులపై కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. మేము బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుతున్నాం.
. – భీమనవేని వెంకటేశ్, తంతోలి, ఆదిలాబాద్ రూరల్
బోథ్, నవంబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న మూడు గంట కరెంట్‌తో ఎకరం పొలానికి నీరు పారదు. బోరుబా వుల్లో నీరున్న కరెంటు లేక పంటల కు నీరందే అవకాశం ఉండదు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెం ట్‌తో అవసరం ఉన్నప్పుడుల్లా పంటలకు నీటి తడులు పెట్టు కుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, రెం డు, మూడు పంటలు పండించుకుంటున్నాం. మాకు సాగునీటి సౌకర్యం లేకపోవడంతో బోరుబావుల కిందనే పండిచుకుంటు న్నాం. 24 గంటలు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతాంగానికి మేలు.
– అయినవేణి పోతాలింగు, రైతు, అందూర్.
జైనథ్, నవంబర్ 20 : కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రైతాంగానికి మూడు గంటల కరెంట్ సరిపోతదని చెబుతున్నరు. మూడు గంటల కరెంటు అసలే సరిపోదు. 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్న ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్‌ను గెలిపిస్తం. ఎందుకంటే నాకు మూడెకరాల భూమి ఉంది. గతంలో వర్షధారంపైనే ఒకటే పంట వచ్చేది. సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువల ద్వారా బ్యాలెన్సింగ్ లక్ష్మిపూర్ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసి చిన్న కాలువ ద్వారా సాగు నీరుకు నీరందిస్తున్నారు. ప్రస్తుతం నేను రెండు పంటలు పండిస్తున్న. తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటా.
-గోర్కర్ ప్రకాశ్, రైతు, ఉమ్రి గ్రామం, జైనథ్ మండలం.
తాంసి, నవంబర్ 20 : మూడు గంటల కరెంటుతో మా పొలాలు సాగు కావు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు మూడు గంటల కరెంట్‌తో రైతులు బాగుపడరు. మాకు మూడు ఎకరాల పొలం ఉంది. పత్తితోపాటు కూరగాయలు పండిస్తు న్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంట ల కరెంట్ ఇవ్వడంతో 5 హెచ్‌పీ మోటర్ల ను వాడుతున్నాం. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ ఇచ్చి 10 హెచ్‌పీ మోటర్లను పెట్టిస్తామని చెబుతున్నారు. రైతులందరు ఒకేసారి 10 హెచ్‌పీ మోటర్లను చాలు చేస్తే ట్రాన్స్ఫార్మర్ పేలి పోయి సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ కాలిపోతాయి. రైతులతో పాటు ఇండ్లలో కూడా కరెంట్ కష్టాలు మొదలవుతాయి. మా రైతులకు సర్కారు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు 25 హెచ్‌పీవి ఉంటాయి. గిప్పుడున్న తెలంగాణ సర్కారు 24 గంటల కరెంట్ ఇస్తున్నది. పంటలు మంచిగ పండుతున్నాయ్. దిగుబడి కూడా మంచిగస్తున్నది.
– ఏడు మేకల రవి, పొన్నారి, తాంసి మండలం.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంటుతో ఎలాంటి రంది లేకుండా పంటలకు నీరు ఇస్తు న్నాం. మూడు గంటల కరెంటుతో మూల కూడా తడవదు. మూడు గంటల కరెంటుతో ఎవుసం బం దు చేసుకోవాలే. గత ప్రభుత్వాలు ఇచ్చిన కరెంటుతో ఎన్నో తిప్పలు పడ్డాం. కరెంటు కోసం మోటర్ల దగ్గర పడుకొని రాత్రి, పగలు కాపలా కాస్తు నీరు పెట్టినం. తెలంగాణ ప్రభుత్వం వచ్చి నాక ఈ తొమ్మిది సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండిస్తున్నాం. రైతులు సంతోషంగా ఉన్నరు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెసోళ్లు మాకద్దు. రైతులకు కష్టాలు తీర్చే ప్రభుత్వానికే మద్దతిస్తాం.
– చెంచాల రాజన్న, రైతు, లక్కారం