నెన్నెల : వర్షాకాలం సీజన్ ( Monsoon Season ) ప్రారంభై నెలరోజుల దాటిపోతున్న మంచిర్యాల జిల్లాలో ( Mancherial district ) సరైన వర్షాలు పడక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ముందస్తు వర్షాలు పడడంతో సంతోషించిన రైతులు అదే ఊపులో పంటల సాగుకు కదిలి నాట్లు వేసుకున్నారు. తీరా వర్షాల జాడ లేక భూమిలో వేసుకున్న నారుమళ్లకు నీరందక రైతన్నలు సతమతమవుతున్నారు.
జిల్లాలోని నెన్నెల మండలంలో (Nennela ) ఒక్క వర్షం కూడా అనుకున్నంత పడలేదు. ప్రతి రోజు చిరు జల్లుల కురుస్తున్నాయి తప్ప భారీ వర్షం పడక చెరువులు, కుంటలు నీళ్లు లేక అడుగంటాయి. వర్షాలు లేక నారుమల్లు ఆలస్యం అవుతుండగా పత్తి చేన్లలో మందులు స్ప్రే చేద్దామన్న చేసేదేమి లేక రైతులు ఇండ్లు, బోరు బావుల వద్ద నుంచి ట్రాక్టర్లలో డ్రమ్ములు పెట్టి వాటిలో నీళ్లు నింపి చేన్లకు తరలిస్తున్నారు. మండలమంతటా ఇదే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.