ఆదిలాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ఏటా వానకాలంలో 5.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. నల్లరేగడి భూములు, అధిక వర్షపాతం కారణంగా పత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. దా దాపు 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు. సోయా, కంది, మక్క పంటలు వేస్తారు.
గతేడాది ఆగస్టు లో కురిసిన భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన సో యా, పత్తి పంటలు నష్టపోవాల్సి వచ్చింది. పం ట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ప్ర కటించినా పరిహారం అందలేదు. పత్తి దిగుబడు లు సగానికి పడిపోగా సోయా రంగుమారడంతో ప్రభుత్వం నాణ్యత పేరిట కొనుగోలు చేయకపోగా ప్రైవేటులో విక్రయించి నష్టపోయారు. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిబంధనలు విధించడంతో మద్దతు ధరకు విక్రయించుకోలేని దుస్థితి నెలకొన్నది.
పెట్టుబడి కోసం తిప్పలు
ప్రభుత్వం యాసంగిలో రైతుభరోసాను కేవలం రెండెకరాలకు విడతలవారీగా పంపిణీ చేసింది. 40 రోజుల్లో నిధులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. గడువు ముగిసినా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. గతంలో రెండు పంటల రైతుభరోసాతోపాటు ఈ ఏడాది యాసంగి డబ్బులు పంపిణీ కాకపోవడంతో రైతులు వానకాలం రైతుభరోసాపై ఆశలు వదులుకున్నారు. యాసంగిలో శనగ కొనుగోళ్లను ప్రభుత్వం సగంలో నిలిపివేయగా.. జిల్లాలో జొన్నల విక్రయించడానికి మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.
సీజన్ వచ్చినా తాము జొన్నలు అమ్ముడు పోక ఇంకా మార్కెట్లోనే ఉండాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు. రైతుభరోసా రాక, కొనుగోళ్లలో జాప్యం కారణంగా పెట్టుబడి కోసం తిప్పలు పడాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు. నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో రెండు, మూడు వర్షాలు పడి భూములు తడిసిన తర్వాత రైతులు పత్తి విత్తనాలు వేస్తారు. వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఏటా మే చివరి వారంలో విత్తనాలు కొనుగోలు చేస్తారని, ప్రస్తుతం చేతిలో డబ్బులు లేకపోవడంతో జూన్ వచ్చినా విత్తనాలు సరిగా కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు అంటున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు
వ్యవసాయ రంగాన్ని ప్రభు త్వం ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు. రైతు భరోసా నామ్కే వాస్తేగా మారింది. యాసంగి రైతుభరోసా 40 రోజుల్లో పూర్తి చేస్తామని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినా.. రెండెకరాలకు మాత్రమే ఇచ్చి మర్చి పోయారు. వానకాలం రైతు భరోసా ఊసేలే దు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పంట లు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు. గతంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చే స్తామని ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తున్నదని మం త్రులు ప్రకటించినా ప్రయోజనం లేదు. రైతులు కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లభిం చడం లేదు. మార్క్ఫెడ్ కేంద్రాల్లో జొన్న పంటల ను అమ్మడానికి రైతులు రోజులుగా ఎదురుచూస్తు న్నారు. మక్క, జొన్న పంటను విక్రయించిన రైతు లు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. సంగెం బొర్రన్న,
రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు