దహెగాం, అక్టోబర్ 29 : భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని మొట్లగూడ, రాంపూ ర్, రావులపల్లి, దిగడ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఏఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌లు జలేల్ల వెంకటేశ్, కోవ కనకయ్యతోపాటు పలువురు రైతులు మాట్లాడు తూ.. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత బ్యాక్‌వాటర్‌తో తమ పంటలు పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయన్నారు.
సర్వే నిర్వహించిన అధికారులు నష్ట పరిహారం కొందరికే ఇచ్చినట్లు పేర్కొన్నారు. నాలుగు గ్రామాల్లో దా దాపు 300 ఎకరాల్లో 450 మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నామమాత్రంగా ఊరికో పది మంది వరకు పరిహారం అందించి చే తులు దులుపుకుందని మండిపడ్డారు. పరిహారం కూడా రాజకీయ పార్టీకి చెందిన వారికి మాత్రమే వచ్చాయని ఆ రోపించారు.
సర్వే నివేదికల్లో ఉన్న ప్రతి రైతుకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమకు నష్టపరిహారం అందించే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు జిలేల్ల వెంకటేశ్, కోవ కనకయ్య, ఇర్ఫాన్, దన్నూరి మల్లేశ్, సిడం శంకర్, ఎల్కరి ప్రభాకర్, చౌదరి అంకన్న, ఆలం శంకర్ పాల్గొన్నారు.