ఉట్నూర్ రూరల్, మే 8: ఉట్నూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు సబ్ బ్రాంచ్ యజమాని ఓం కార్ శుక్రవారం యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసేందుకు నగదు తీసుకెళ్లగా అందులో నాలుగు నకిలీ రూ.500 నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు.
ఈ నోట్లపై ఓంకార్‌ను అడుగగా తన దగ్గరికి కస్టమర్లు డిపాజిట్ చేసేందుకు తీసుకువచ్చిన నోట్లను తాను మెయిన్ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసువచ్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై బ్యాంకు అధికారు లు పోలీసులకు సమాచారం అందించారు. నకిలీ నోట్లు ఎలా వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. మండలంలో నకిలీ నోట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.