నెన్నెల: ఎరువులు వేసేముందు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని బీమిని ఏడిఏ సురేఖ ( ADA Surekha ) రైతులకు సూచించారు. యూరియా ( Urea ) అధికంగా వాడితే పంటకు తీవ్ర నష్టం కల్గుతుందని వెల్లడించారు.
శుక్రవారం మండలంలోని పలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు యూరియా అధికంగా వాడవద్దని సూచించారు. ఎకరానికి 45 కిలోల బస్తా మాత్రమే వాడాలని , ఎక్కువ యూరియా వాడితే పచ్చదనం పెరిగి పంటను ఆశించే పురుగుల ఉధృతి , పురుగు మందులు ఖర్చు పెరుగుతుందని వివరించారు. తెగులు వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
యూరియాతో పాటు ఇతర ఎరువులు ఏదైనా దశల వారిగా వాడితే మొక్కకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వరిలో నాటు వేసుకునే ముందు ఎకరాకు ఒక బస్తా డీఏపీ , అరబస్తా యూరియా, అరబస్తా పొటాషియం కలిపి దమ్ములు వేసుకోవాలనిసూచించారు. ఆమె వెంట ఏవో సృజనా,ఏఈవో రామచందర్ఉన్నారు.