ఎదులాపురం, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిషరించనున్నారు.
ఇందుకు అనుగుణంగానే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ సలహాదారులు ఉదయం 9.35 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. 9.40 గంటలకు జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టరేట్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. ఆదివారం ఈ ఏర్పాట్లను ఆర్డీవో వినోద్ కుమార్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు.
నిర్మల్ అర్బన్, జూన్ 1 : నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్ పర్సన్ రాజయ్య హాజరవుతున్నారని, పట్టణవాసులు, అధికారులు హాజరుకావాలని తెలిపారు.