వాంకిడి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో (Spiritual path ) నడవాలని మాలి సంక్షేమ సంఘం కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ అధ్యక్షుడు సెండ్ వాసు (Vasu) అన్నారు. శుక్రవారం మండలంలోని బంబార గ్రామంలో పరమ హంస సద్గురు శ్రీ పూలాజీ బాబా (Phulaji Baba) గాన కేంద్ర 16వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
వాసు మాట్లాడుతూ పూలాజీ బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని , బాబా చూపిన ఆధ్యాత్మిక ధ్యాన మార్గాలతో ఎన్నో కుటుంబాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా సెండ్ వాసుకు శాలువాతో సత్కరించి, షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు ఆనందరావు, రమేష్, కృష్ణాజీ, ప్రకాష్, బడిరాం, ధ్యాన మండల కేంద్ర శాఖ కమిటీ సభ్యులు బెండరి కృష్ణాజీ, జ్యోతిబా, పెట్ కార్ సతీష్, సండే రవి, సండే అన్నాజీ, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.