ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్నే ఎంచుకోవాలి.. జడ్పీ చైర్పర్సన్

ఆసిఫాబాద్ : ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్నే ఎంచుకోవడం వల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుందని, బౌద్ధుడి బోధనల వల్ల ప్రపంచ శాంతి సాధ్యమయిందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బౌద్ధ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుద్దుని బోధనలు సకల మానవాళి జీవితాల్లో శాంతిని అందిస్తుందన్నారు. ప్రపంచం అంతా బుద్ధుని బోధనలు అవలంబించాలని కోరారు.
ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుల త్యాగాల ఫలితంగా ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో బుద్ధిస్ట్లు బైక్‌ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గాదవేణి మల్లేశ్, పీఎసీఎస్ చైర్మన్ అలీబీన్ హైమద్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, బౌద్ధ కవి మధు బావర్కర్, అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

