తాండూర్ : పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా రవాణా చేయకుండా కట్టడి చేయాలని తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న ( Tahasildar Jyotsna ) అన్నారు. మండలంలోని రేపల్లెవాడ వద్ద గల మంచిర్యాల ఆసిఫాబాద్ అంతర్ జిల్లాల సరిహద్దు చెక్పోస్టును ఆమె శుక్రవారం తనిఖీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అక్రమ మద్యం, డబ్బు రవాణాపై నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.