ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదునూ చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీసులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సూచించారు.
లక్ష్మణచాంద, జూన్ 26 : ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదునూ చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీసులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. లక్షణచాంద మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, బెయిల్ కేసుల నిర్వాహణ, రిసెప్షన్, మాల్టాన, ఆయుధాగారం, సీసీ కెమెరాల పనితీరు సిబ్బంది హాజరు రిజిస్టర్లు, పోలీస్‌స్టేషన్ పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం, లక్ష్మణ్ చందా పోలీస్‌స్టేషన్‌కు నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని మహిళలు, చిన్నారులు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మ ణ్ చందా, ఎస్ఐ శ్రావణి, పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులపై శ్రద్ధ చూపాలి
జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం ద్వా రా అందిన ఫిర్యాదులు, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని ఆదేశించారు.
నిర్మల్ ఎస్పీ
జానకీ షర్మిల
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

