ఎదులాపురం, ఏప్రిల్ 7 : ఆదిలాబాద్ పట్టణంలోని పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జేఏసీ నాయకుడు కొమ్ము కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. గతేడాది మూల్యంకన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ మూల్యాంకన రెమ్యూనరేషన్ పెంచినప్పటికీ పదో తరగతి మూల్యాంకన రెమ్యూనరేషన్ పెంచడం లేదన్నారు. ధర్నాలో నాయకులు స్వామి, వి.అశోక్, జాదవ్ రవికుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.