అన్ని వర్గాలకు వరం ఎన్ఎల్ఎం
ప్రభుత్వం రైతులు, సహకార సంఘాలు, నిరుద్యోగులకు ఉపాధి చూపడమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) పథకాన్ని తీసుకువచ్చింది.
- నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్‌తో స్వయం ఉపాధికి భరోసా
- గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకం,పశువుల దాణా తయారీకి యూనిట్లు
- ఏ యూనిట్‌కైనా 50 శాతం రాయితీ
- పోర్టల్ nlm.udayamimitra.inలో దరఖాస్తులకు అవకాశం
మంచిర్యాల అర్బన్, మార్చి 25 : ప్రభుత్వం రైతులు, సహకార సంఘాలు, నిరుద్యోగులకు ఉపాధి చూపడమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) పథకాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకంతో పాటు పశువుల దాణా తయారీ యూనిట్లు కేటాయిస్తోంది. ఒక్కో యూనిట్ విలువ రూ. 20 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వమే సగం రాయితీ ఇస్తుంది.
గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా రుణ వ్యయం ఎక్కువగా ఉండడంతో ఆశించిన స్థాయిలో రైతులు ముందుకు రాలేదు. దీంతో విధి, విధానాలు మార్పు చేసింది. నూతన పాలసీ ప్రకారం ఒక యూనిట్‌కు రూ. 20 లక్షలు నుంచి రూ. కోటి వరకు రుణ సాయం అందించనున్నది. ఈ పథకం గొల్ల, కుర్మలకే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికీ రుణం అందించనున్నది. పశుసంవర్ధక శాఖ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి రుణ సాయం అందించనున్నారు. 2021-22లో ప్రారంభమైన ఈ పథకం 2026-27 వరకు అమల్లో ఉంటుంది.
అర్హులు వీరే…
- ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన ఈ పథకానికి అన్ని సామాజిక వర్గాల వారు అర్హులు.
- స్థాపనకు సరిపడా సొంత స్థలం లేదా లీజు స్థలం కలిగి ఉండాలి. (2 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు)
- నుంచి 55 ఏండ్లలోపున్న వారు nlm. udayamimitra.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- కుటుంబం నుంచి ఎందరైనా యూనిట్లు పొందవచ్చు.
- దరఖాస్తులను పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
- ఇచ్చేందుకు బ్యాంకర్ల అనుమతి తప్పనిసరి.
- విభాగాల్లో దేనికైనా దరఖాస్తు చేసుకొని రుణం తీసుకోవచ్చు.
గతంలో…
- జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా గతంలో రూ. కోటి రుణంలో 50 శాతం (రూ. 50 లక్షలు) రాయితీ కింద ఇచ్చేవారు. మిగితా 50 శాతంలో బ్యాంకు ద్వారా రూ. 40 లక్షలతో పాటు లబ్ధిదారుడు రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉండేది. ఈ పథకంలో దరఖాస్తు చేసుకుంటే 500 ఆడ, 25 మగ జాతి గొర్రెలను కొనుగోలు చేయాల్సి వచ్చేది. షెడ్డు నిర్మాణం, దాణా కోసం పశుగ్రాసం పెంచాలి. ఇది వ్యక్తిగతంగా, సంఘంగా ఉండి కూడా రుణం పొందవచ్చు.
ఐదు విభాగాలుగా…
- గతంలో కోటి రూపాయలు రుణంగా ఇచ్చేవారు. ఇది పెద్ద మొత్తం కావడంతో లబ్ధిదారులు సమకూర్చుకోలేరని, బ్యాంకులు కూడా రుణం ఇవ్వలేవన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాగా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఇటీవల రుణం మంజూరు నిబంధనలను మార్పు చేసింది. ఐదు విభాగాలుగా యూనిట్లను విడదీసింది.
- మేకల పెంపకం యూనిట్ : 105 (100 గొర్రెలు, 5 పొట్టేళ్ల) గొర్రెలకు రూ. 20 లక్షలు, 210 (200 గొర్రెలు, 10 పొట్టేళ్ల) గొర్రెలకు రూ. 40 లక్షలు, 315 (300 గొర్రెలు, 15 పొట్టేళ్ల) గొర్రెలకు రూ. 60 లక్షలు, 420 (400 గొర్రెలు, 20 పొట్టేళ్ల)గొర్రెలకు రూ. 80 లక్షలు, 525 (500 గొర్రెలు, 25 పొట్టేళ్లు) గొర్రెలకు రూ. కోటి అందించనున్నది. ఇందులో 50 శాతం సబ్సిడీపోను 50 శాతం బ్యాంకు గ్యారంటీ ఉంటుంది.
- ఫారం ఏర్పాటు : 250 కోడి పెట్టలు, 25 పుంజుల పెంపకం విలువ రూ. 25 లక్షలు కాగా, అందులో ప్రభుత్వం రూ. 12.5 లక్షల సబ్సిడీ అందిస్తుంది. వెయ్యి కోడి పెట్టలు, 100 పుంజులకు రూ. కోటి కాగా, రూ. 50 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మిగితావి బ్యాంకు రుణంగా కాని, స్వయంగా కాని సమకూర్చుకోవాలి.
- తయారీ యూనిట్ : పశుగ్రాసం తయారీ యూనిట్ కోసం సైలేజీ తయారీ యూనిట్, పశుగ్రాస దిమ్మల తయారీ యూనిట్, సమీకృత దాణా తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులకు రూ. 50 లక్షల వరకు రాయితీ ఇస్తారు. రూ. కోటి, అంతకన్నా ఎక్కువైనా రూ. 50లక్షలు, అంతకన్నా తక్కువ ఉంటే ప్రాజెక్టు విలువలో 50 శాతం రాయితీ అందజేస్తారు.
- పెంపకం : పందుల పెంపకానికి 50 ఆడ, 12 మగ పందుల యూనిట్‌కు రూ. 30 లక్షలు కాగా, రూ. 15 లక్షలు సబ్సిడీ వస్తుంది. 100 ఆడ పందులు, 25 మగ పందులకు రూ. 60 లక్షలు కాగా, రూ. 30 లక్షలు సబ్సిడీ వస్తుంది. అయితే తీసుకున్న యూనిట్లో సబ్సిడీని ప్రారంభంలో 50 శాతం, మిగిలిన సబ్సిడీని రెండేళ్ల తర్వాత బ్యాంకులో జమ చేస్తారుచేస్తారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

