వాంకిడి, మే 18 : మండలంలోని సరాండి టోల్ ప్లాజా వద్ద శనివారం 123 క్వింటాళ్ల 30 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్‌కుమార్ తెలిపారు.
టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఐచర్ వ్యాన్‌లో మహారాష్ట్రకు తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని ఆసిఫాబాద్ పాయింట్‌కు తరలించామని, ఐచర్ వ్యాన్‌ను సీజ్ చేసి వాంకిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.