ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఆగస్టు 28 : తమను రెగ్యుల్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉ ద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అనేక హా మీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన త ర్వాత పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
100 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమను వెంటనే రెగ్యులర్ చేసి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిర్పూ ర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందురావు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ మద్దతు పలికారు.
అనంతం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి తుకారాం, కోశాధికారి నగేశ్, నాయకులు దేవేందర్, మహేశ్వర్, సత్యనారాయణ, రాజేశ్, జిల్లా నాయకులు గెడేకార్ సంతోష్, సోను, సందీప్, రాము, సుభాష్, పీటీఐ రమేశ్, దేవన్న, రాజేశ్ ఉన్నారు.