చింతలమానేపల్లి, ఏప్రిల్ 17 : విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందని, సక్రమంగా సరఫరా చేయాలని చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ధర్నాలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపుతామమని అధికారులు తెలపడంతో గ్రామస్తులు శాంతించారు.
తెగిపడ్డ కరెంట్ తీగ
రవీంద్రనగర్ సబ్‌స్టేషన్ నుంచి బాబాసాగర్ వెళ్లే త్రీఫేజ్ విద్యుత్ లేన్‌లోని ఒక తీగ బాలాజీ అనుకోడ గ్రామ శివారులోని పంట పొలాల్లో గురువారం రాత్రి తెగిపడింది. దీనితో పొలాల్లోని గడ్డి కుప్ప కాలిపోయింది. స్థానికులు జేఎల్ఎం సుదర్శన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన సిబ్బందికి తెలుపడంబతో పంచాయతీ వాటర్ ట్యాంకర్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే గడ్డి కాలిపోయింది. దీనితో బాబాసాగర్, చింతలమానేనెపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.