ఆసిఫాబాద్ : జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపటార్ గ్రామంలో వడదెబ్బ ( Heatstroke) కారణంగా ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది ఆసుపత్రి పాలయ్యారు. గత వారం రోజులుగా వేసవి తీవ్రత పెరగడంతో ఆత్రం అక్బర్ షా( Akbar Shah ) అనే ఉపాధి కూలీ మృతి చెందగా మరో ఎనిమిది మంది దినకర్షవ్ ( 21), మారు ( 20 ), తూర్పు బాయి ( 20 ) , ఆత్రం రాము ( 5 ) , ఆత్రం సుజాత ( 18 ), ఆత్రం యశోద ( 10 ) , హీరా ( 18 ), సీతారాం ( 45 ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటినా జైనూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.