ఆదిలాబాద్ : గిరిజన ప్రజల (Tribal issues ) సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బు గుప్తా ( Khushbu Gupta) అధికారులను ఆదేశించారు . సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ ( ITDA)కార్యాలయ ఛాంబర్ లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల అర్జీలను స్వీకరించారు.
ఉట్నూర్ మండలం మార్కగూడ గ్రామానికి చెందిన మధు తమ గ్రామానికి సోలార్ విద్యుత్ సౌకర్యం కలిపించమని, తలమడుగు మండలం ఝరి గ్రామానికి చెందిన గేడం శంకర్ బోర్వెల్ మంజూరు చేయాలని కోరారు. ఆదిలాబాద్ మండలం ఖండల గ్రామానికి చెందిన శ్రీదేవి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని కోరారు. పింఛన్,ఇందిరమ్మ ఇండ్లు,రైతు భరోసా,స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.
సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని పీవో సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణిలో ఏపీవో మెస్రంమనోహర్ , ఏవో దామోదర స్వామి మనోహర్ , ఈఈ తానాజీ, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం , అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.