విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ సిబ్బంది విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. సారంగాపూర్ మండల కేం ద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీఎస్పీ తనిఖీ చేశారు.
- నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి
సారంగాపూర్, జూలై 17: పోలీస్ సిబ్బంది విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. సారంగాపూర్ మండల కేం ద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం పోలీస్‌సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అంతక ముందు డీఎస్పీకి ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు, హారతిని అందించారు. నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు సమష్టిగా పనిచేయాలని నిర్మల్ డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి అన్నారు. దిలావర్పూర్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. అ నంతరం పోలీస్ స్టేషన్లో గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను, కేసు వివరాలను పరిశీలించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగం గదిని పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూ ర్వకంగా మెలగాలని సూచించారు. 100కు వచ్చి న ఫోన్ కాల్‌ను త్వరితగతిన స్పందించి పరిష్కారించాలని కోరారు. నిర్మల్ గ్రామీణ సీఐ బీ శ్రీనివాస్, ఎస్ఐ గంగాధర్ ఉన్నారు.
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను సోమవారం డీఎస్పీ గంగారెడ్డి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఆవశ్యకత , సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రూరల్ సీఐ శ్రీనివాస్, నర్సాపూర్ ఎస్ఐ రవీందర్, ఏఎస్ఐ మాన్సింగ్, సి బ్బంది మహేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

