సీసీసీ నస్పూర్, ఆగస్టు 1 : మహిళా పోలీసులు పురుషులతో సమానంగా విధులు నిర్వహించాలని ఆర్బీవీఆర్ఆర్ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పేర్కొన్నారు. శుక్రవారం సీసీసీలోని సింగరేణి అతిథి గృహంలో గల సమావేశ మందిరంలో రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో, మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. పోలీస్ డ్యూటీలు, పోస్టింగ్, సెలవులు, పోలీస్‌స్టేషన్‌లో నిర్వహిస్తున్న డ్యూటీలు, పనిచేస్తున్న ప్రదేశంలో నెలకొన్న సమస్యలు, కుటుంబ సమస్యలు తదితర వివరాలు అభిలాష్ బిస్త్ అడిగితెలుసుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆమె పలు సలహాలు, సూచనలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ డ్యూటీల్లో మెన్, ఉమెన్ అనే తేడా లేకుండా పనిచేయాల్సి ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్లో రిసెప్షన్, రికార్డు వర్, సీసీటీఎన్ఎస్, టెక్‌టీమ్, పోలీస్ స్టేషన్లో విధులతో పాటు బయట డ్యూటీలు కమ్యూనిటీ పోలిసింగ్ ప్రోగ్రాం, బ్లూ కోల్డ్స్, నైట్ పెట్రోలింగ్, పిటిషన్ ఎన్‌క్వైరీ కోర్ట్ డ్యూటీ, మెడికల్ డ్యూటీ, వెహికల్ చెకింగ్, క్రైమ్, ఎసార్ట్ డ్యూటీ, ట్రాఫిక్, బందోబస్తు మెన్‌తో సమానంగా విధులు నిర్వహించాలన్నారు. మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి, పోలీస్‌స్టేషన్‌లో సూటీ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మంచిర్యాల డీసీపీ భాసర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల జోన్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, ఆగస్టు 1 : శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆర్బీవీఆర్ఆర్ డైరెక్టర్ అభిలాష్ బిస్తు (ఐపీఎస్), అడిషనల్ డీజీ సందర్శించారు. ఆమెకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచంద ర్ ఎస్ఐ సంతోష్ మొకలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఏఆర్ మహిళా సాయిధ దళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఆర్ఐ సంపత్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
హాజీపూర్, ఆగస్టు 1 : ర్యాలీగఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంసీసీ క్వారీలో ఉన్న దుర్గాదేవిని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ శుక్రవారం దర్శించుకున్నారు. దుర్గాదేవికి పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి.. అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. సన్మానించారు. డీసీపీఎగ్గడి భాస్కర్ (ఐపీఎస్), మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ కుమార్ తదితరులున్నారు.