Grand honor | మందమర్రి(రూరల్): పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఈజీఎస్ ఏపీవో రజియా సుల్తానా ను ఎంపీడీవో రాజేశ్వర్, ఇతర అధికారులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఏసీయా ఇంటర్నేషనల్ వైదిక్ అకాడమీ ఆధ్వర్యంలో సామాజిక సేవ అనే అంశంపై ఏపీవో రజియా నిర్వహించిన పరిశోధనకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాదు నుండి గౌరవ డాక్టరేట్ ఇటీవల అందుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వర్ తో పాటు వివిధ శాఖల అధికారులు డాక్టరేట్ గ్రహీతను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, ఏపీఎం లలిత, ఈజీఎస్ ఈసీ మధు, టీఏ రాజమల్లు,కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈద లింగయ్య, సత్యనారాయణ, రాజేందర్, మాజీ సర్పంచ్ ఓడ్నాల కొమురయ్య, గందె రామచందర్, బీఆర్ఎస్ నాయకులు ఫిరోజ్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.