జన్నారం, జూలై 10 : మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తన సంస్థ ద్వారా విద్యారంగంలో ఎనలేనిసేవలు అందిస్తున్నందుకుగాను హైదరాబాద్‌కు చెందిన థియోలాజికల్ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ బెస్ట్ సర్వీస్ అవార్డును ప్రదానం చేసింది. డాక్టరేట్ పొందిన యాదగిరి శేఖర్‌రావును గ్రామస్తులు, మిత్రులు, ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలు అభినందించారు.
నస్పూర్, జూలై 10 : మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త రాపోలు వి ష్ణువర్ధన్రావు గురువారం గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 27 ఏళ్లుగా విద్యారంగ సమస్యల పరిష్కారం, విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు, కరోనా కాలంలో సే వలందించినందుకుగాను హోప్ థియోలాజికల్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ట్రస్మా సభ్యులు అభినందించారు.