తాండూర్ : సంక్షేమ పథకాల నిర్వహణను ప్రైవేటు ఇన్సూరెన్స్ ( Private Insurance) కంపెనీలకు అప్పగించేలా తీసుకొచ్చే జీవో 12ను వెంటనే సవరించాలని సీఐటీయూ ( CITU ) జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తాండూర్ మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల యూనియన్ సమావేశం శనివారం అధ్యక్షుడు కొంక అశోక్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన రంజిత్ కుమార్ మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు (Welfare Board ) నుంచే కార్మికులకు ప్రభుత్వ పథకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎస్సీ ద్వారా హెల్త్ టెస్టులను చేయించడాన్ని రద్దు చేయాలని, సహజ, ప్రమాదవశాత్తు మరణాలకు పరిహారం, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం కలిగే వారికి ఆర్థిక సహాయం అందించే పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం దారుణమని విమర్శించారు.
మిగతా ఎనిమిది ప్రభుత్వ పథకాలను పూర్తిగా విస్మరించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు సంకే రవి, జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం, తాపీ మేస్త్రి కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సాలిగామ పోశం, ముఖ్య సలహాదారులు చదువుల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పూదరి మల్లేష్, పోతురాజుల శంకర్, యశ్వంత్, గజ్జల నారాయణ, అశోక్, మేకల రమేష్, నాయకులు కార్మికులు పాల్గొన్నారు.