సారంగాపూర్, ఆగస్టు 9 : మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని స్వచ్ఛదనం-పచ్చదనం ప్రత్యే క అధికారి రవి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ధని జిల్లా పరిషత్ సెంకడరీ పాఠశాలలో జరిగిన స్వచ్ఛదనం-పచ్చదనం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅథిగా హాజరయ్యారు.
ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఇం ట్లో మొక్కలు పెంచుకునే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్హైమద్, డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎంహెచ్వో రాజేందర్, డీపీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మికాంత్రావు, పాఠశాల హెచ్ఎం సలోమికర్ణ, పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 9 : నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రత్యేక అధికారి రవి, కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.