ఎదులాపురం, సెప్టెంబర్ 3 : ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ ఏజెన్సీ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద 237 పాఠశాలల్లో పనులు చేపట్టామని, ఇప్పటి వరకు రూ. 30 లక్షలలోపు 191 పనులను గ్రౌం డింగ్ చేశామని తెలిపారు. ప్రారంభించిన పను లను వెంటనే పూర్తి చేసి ఆన్లైన్లో బిల్లులు సమర్పించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రెయినీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, డీఈవో టీ ప్రణీత, రోడ్లు భవనాలు శాఖ ఈఈ నర్సయ్య, పంచాయితీ రాజ్ ఈఈ మహావీర్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ భీంరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఈఈ అశోక్, సెక్టోరల్ అధికారులు ఉన్నారు.
ప్రతి ఒక్క ఓటరును ప్రోత్సహించాలి
ఎదులాపురం, సెప్టెంబర్ 3 : ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ సీడింగ్ స్వచ్ఛందంగా చేసుకు నేలా ప్రతి ఒక్క ఓటరును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ మున్సిపల్ రిసోర్స్ పర్సన్లు, కమ్యునిటీ ఆర్గనైజర్ల తో ఓటర్ సీడింగ్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బూత్ స్థా యి అధికారులు ఆయా సమావేశాలకు వెళ్లి మహిళా సంఘం సభ్యురాలు తమ పేరును ఓట రుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిం చాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ 18 సంవత్స రాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరుగా నమోదు చేయడంతో పాటు గుర్తింపు కార్డు కలిగిన వారి ఆధార్ సీడింగ్ నిర్ణీత ఫారం -6(బీ)లో నిర్వ హించాలని పేర్కొన్నారు. ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఎంసీ శ్రీనివాస్, స్విప్ నోడల్ అధికారి లక్ష్యణ్ ,ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియా, తహ సీల్దార్లు సతీశ్, వనజ ,తదితరులు ఉన్నారు.
ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఎదులాపురం, సెప్టెంబర్ 3 : సామ్-మామ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ పోషణ మాసం, సామ్-మామ్ పిల్లల పర్యవేక్షణాపై సీడీపీవోలు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామ్- మాన్ పిల్ల ల ఆరోగ్యం మెరుగుపడేలా చర్యలు చేపట్టాల న్నారు. అంగన్వాడీ, సూపర్వైజర్లు పర్యవేక్షించా లని సూచించారు. ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ కర్యాక్రమాలు ఈ నెల 15వరకు నిర్వహిస్తామ న్నారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, డీఎం హెచ్‌వో నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, అదనపు జిల్లా వెద్యారోగ్య శాఖ డాక్టర్ సాధన, సీడీపీవోలు, సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు.
ఈ నెల 5 నుంచి స్వచ్ఛ్ గురుకులం
ఇచ్చోడ, సెప్టెంబర్ 3 : ఈ నెల 5 నుంచి 11 వరకు రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో స్వచ్ఛ్ గురుకులం కార్యక్రమాలను నిర్వహించేలా అధికారం యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్ కార్యాల యంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వచ్ఛ్ గురుకులం కార్యక్రమానికి సంబంధించిన పోస్ట్టర్ల ను ఆవిష్కరించారు. వారం రోజుల పాటు నిర్వ హించనున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాల వివరా లను కలెక్టర్ తెలిపారు. తరగతి గదులు, వంట గది, డైనింగ్ హాల్, క్యాంపస్, శుభ్రపర్చడం, అన్ని గురుకులాల్లో పరిశుభ్రత పనులు నిర్వ హించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ్ కార్యక్ర మాన్ని రూపొందించిందన్నారు. ప్రతి రోజూ ఒక అతిథిని గురుకులంకు ఆహ్వానించి కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రణీత, ఈఈ భీంరావ్, ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీకాంతరావ్, నర్సిం హారావ్, హరిరామ్, సరిత ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.