‘హైరింగ్ సెంటర్’ అలంకార ప్రాయం
జిల్లా కేంద్రంలోని కస్టమ్ హైరింగ్ (రైతులకు పరికరాలు-యంత్రాలు అద్దెకిచ్చే కేంద్రం) సెంటర్ అలంకార ప్రా యంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారగా, లక్షలాది రూపాయల విలువైన ట్రాక్టర్‌తో పాటు పరికరాలు తుప్పు పట్టే పరిస్థితి వచ్చింది.
- ఆసిఫాబాద్‌లో నిరుపయోగంగా మారిన సాగు పరికరాలు అద్దెకిచ్చే కేంద్రం
- నిర్వహణ లోపంతో తుప్పుపట్టిపోతున్న వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్
- పట్టించుకోని అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని కస్టమ్ హైరింగ్ (రైతులకు పరికరాలు-యంత్రాలు అద్దెకిచ్చే కేంద్రం) సెంటర్ అలంకార ప్రా యంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారగా, లక్షలాది రూపాయల విలువైన ట్రాక్టర్‌తో పాటు పరికరాలు తుప్పు పట్టే పరిస్థితి వచ్చింది.
రూ. 20 లక్షలతో..
సాగులో యాంత్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణాభివృద్ధిశాఖ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్ల’(వ్యవసాయ పరికరాలు-యంత్రాల అద్దె కేంద్రాలు)ను ఏర్పాటు చేయించింది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మి మహిళా సంఘం ద్వారా కూడా ఓ సెంటర్‌ను ప్రారంభించింది. సుమారు రూ. 20 లక్షలతో ట్రాక్టర్‌తో పాటు అన్ని రకాల పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు తమ అవసరాన్ని బట్టి వాడే పనిముట్లు, యంత్రాలకు ధరలు నిర్ణయించింది.
కానీ.. నిర్వహణ లేకపోవడంతో ఈ కేంద్రం అలంకార ప్రాయంగా మారింది. అధికారుల పట్టింపులేని తనంతో పాటు మహిళా సంఘాలకు సరైన అవగాహన లేకపోవడంతో ట్రాక్టర్‌తో పాటు పనిముట్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. మహిళా సంఘాలకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు రైతులకు తక్కువ ధరలకే పనిముట్లు అందించాల్సిన కస్టమ్ హైరింగ్ కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

