సారంగాపూర్, జూన్ 25: సాంకేతిక రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను విద్యాశాఖ సైతం అందిపుచ్చుకుంటున్నది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పా టు బడుల సమాచారం పక్కాగా అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల చిన్నారులు సామర్థ్యాలు తెలుసుకునేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేశారు. విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు మన ఊరు-మనబడి ద్వారా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్మల్ జిల్లాలోని 542 పాఠశాలలకు గాను 553 ట్యాబ్‌లను విద్యాశాఖ అధికారులు అందజేశారు.
విద్యార్థి నమోదు కార్యక్రమం ఇలా…
నిర్మల్ జిల్లాలో 610 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 535, ప్రాథమికోన్నత పాఠశాలలు 85 ఉండగా 553 ట్యాబ్‌లను ట్యాబ్‌లను అందించారు. వీటిని డిజిటల్ బోధనకు ఉపయోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 10 నుంచి 160 మంది విద్యార్థులకు ఒక ట్యాబ్ అంత కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే రెండు ట్యాబ్‌లను ఉపాధ్యాయులకు అందజేశారు. విద్యాశాఖ అమలు చేస్తున్న కా ర్యక్రమాలు, పురోగతి, పాఠశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ట్యాబ్‌ల్లో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇ ప్పటి వరకు విద్యార్థుల ప్రవేశాలు, మార్కుల వివరాలు, ఉపాధ్యాయుల సమాచారం మండల విద్యావనరుల కేంద్రాల్లో సీఆర్పీల సహకారంతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. 2023-2024 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థి పాఠశాలకు వచ్చిన మొదటి రోజునే పేరు న మోదు, తల్లిదండ్రుల పేర్లు, పాఠశాలలో ప్రవేశ సంఖ్య, తరగతి, ఏ సంవత్సరంలో చేరాడు, ఏ సంవత్సరంలో వెళ్లి పోయాడు, పుట్టినతేదీ, ఆధార్‌కార్డు నంబర్, పుట్టుమచ్చలు, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, తల్లిదండ్రుల ఫోన్ నంబర్ నమోదు చేస్తారు.
విద్యాపరమైన వివరాల కింద ప్రతి తరగతిలో వచ్చిన మార్కులు, వి ద్యార్థి సబ్జెక్టుల వారీగా బలాలు, బలహీనతలు, ఆరోగ్యకరమైన వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తుండాలి. నెలవారీ పాఠశాల పనిదినాలు, విద్యార్థి హాజరైన రోజు లు, ఏటా నిర్వహించే వివిధ పరీక్షల్లో వచ్చిన మార్కు లు, విద్యాసంవత్సరం చివరి అభివృద్ధి నమోదు చేయా ల్సి ఉంటుంది. వాటితో పాటు హాజరు, మధ్యాహ్న భోజనం వివరాలు, యూనిఫాం, పుస్తకాల పంపిణీ, ర వాణా భత్యం, యూ డైస్, ఇలా ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం సంబంధిత పోర్టల్‌లో నమోదు చే యాల్సి ఉంటుంది.
ట్యాబ్‌లు పంపిణీ చేశాం.
నిర్మల్ జిల్లాలో పాఠశాలలకు ట్యాబ్‌లను పంపిణీ చేశాం. ఇకపై విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ట్యాబ్‌ల ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశా లలకు ఉపయోగపడేలా వీటిని ప్రభుత్వం అందజేసింది.
-రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్