ఎదులాపురం, ఆగస్టు 25: సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీడీ టేకేదార్లకు రూ.2016, దివ్యాంగులకు ఆసరా పెన్షన్ రూ.4016 పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతినెలా 30,972 మందికి రూ.7.18కోట్ల ఆసరా పింఛన్లు, 3,055 మంది దివ్యాంగులకు రూ.1.22 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 9 మంది బీడీ టేకేదార్లకు రూ.2016 చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇద్దరూ దొంగలేనని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా ఫెన్షన్, రైతుబంధు, రైతు బీమాలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వచ్చి అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వని సంక్షేమ పథకాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినా సంక్షేమ పథకాలు ఎందుమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మూడోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిషన్, గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహార్, మున్సిపల్ కమిషనర్ ఆదుముల్ల శైలజ, జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు భరత్ కుమార్, స్వామి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, ప్రధాన కార్యదర్శి అష్రఫ్, నాయకులు ఏవన్, నల్ల రాజేశ్వర్, రాంకుమార్, దాసరి రమేశ్, దివ్యాంగుల సంఘ నాయకులు సునీల్, నగేశ్, సురేశ్ ఉన్నారు.
సర్వ మతాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని శంకర్ గూడలో కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన బీరప్ప ఆలయ పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.47లక్షలతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆదిలాబాద్ నియోజకవర్గంలో 61 ఆలయాల అభివృదికి, నూతన ఆలయాల నిర్మాణానికి రూ.11కోట్ల 20 లక్షలు కేటాయించామన్నారు. భగవంతుడి పేరు చెప్పి రాజకీయాలు చేసే బీజేపీ ఆలయాల నిర్మాణానికి ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపితే పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు రఘుపతి, అశోక్‌స్వామి, నాయకులు దివిటి రాజు, రాం కుమార్, ఆలయ కమిటీ సభ్యులు ఐలయ్య పోశెట్టి, పోతన్న, రాజు, వెంకన్న, రాజారెడ్డి ఉన్నారు.
సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాభావు సాఠే 103వ జయంతిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సాఠే జయంతి కరపత్రాలను సంఘం నాయకులతో కలిసి విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని నూతన అంబేద్కర్ భవనంలో నిర్వహించే అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకలకు సాఠే మనుమడు సచిన్బావు సాఠే హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో అన్నాభావు సాఠే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే ఉద్దవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ యూనిస్ అక్బానీ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాధవ్ గుంఠే, నాయకులు వాసుదేవ్, సంభాజీ, అర్జున్, జ్ఞానోబా, సూర్యకాంత్, డీకే నాందేవ్, రాజ్‌కుమార్ ఉన్నారు.