నర్సాపూర్ జి / కడెం : గురువారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు (SSC Exams) అధికారులు సన్నహాలు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను పరీక్షల ప్యాడ్లను ( Exam pads ) అందజేశారు. నర్సాపూర్ జి ( Narsapur G) ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన యువకులు ఎండీ నోమాన్, జమిల్షా, ఎండీ జాబీర్లు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, పెన్నులు, పెన్సిల్స్ ను అందించారు.
రాబోయే వార్షిక పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. పదవ తరగతి అనేది జీవితంలో ఒక మొదటి మెట్టుగా భావించి చదువు చెప్పిన గురువులకు కన్న తల్లిదండ్రులకు, పుట్టి , పెరిగిన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, గంగారం, అజారుద్దీన్, అప్సానా నేహాల్, సపోరా ఫాతిమా, సాజిత్, మొహిద్దిన్ ,నిస్సార్ ఫాతిమా ,సయ్యద్ సర్పరాజ్, స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ మగ్బుల్, రైస్ ఖాన్, జిషన్ , హనీఫ్ తదితరులు ఉన్నారు.
కడెంలో..
కడెం ( Kadem ) మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాల విద్యార్థులకు కడెంకు చెందిన రాఘవేంద్ర పాఠశాల వారి రాఘవేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన ప్యాడ్, పెన్నులు, పెన్సిల్స్, ఇతర పరీక్షల సామగ్రిని ట్రస్ట్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ రానున్న పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎర్ర సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ సిబ్బంది, రాఘవేంద్ర పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.