కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipet) మండలంలో బావిలో పడ్డ శునకాన్ని ( Dog ) అధికారులు రక్షించారు. ఐదురోజుల క్రితం మండలంలోని కాసిపేట 2 ఇంక్లైన్ గనికి వెళ్లేదారిలో ఉన్న పాడుబడ్డ బావిలో శునకం ప్రమాదవశాత్తు అందులో పడింది. స్థానిక యువకులు బావిలో పడ్డ కుక్కకు నీరసంగా ఉండడంతో ఆహారాన్ని అందించారు. వెంటనే బెల్లంపల్లి విపత్తు (Disaster department ) , అగ్నిమాపక సేవల శాఖలకు సమాచారం అందించారు.
దీంతో ఫైరింజన్‌తో వచ్చిన అధికారులు, సిబ్బంది స్థానిక యువకులతో కలిసి వలల సహాయంతో శునకాన్ని బావిలో నుంచి బయటకు తీసి కాపాడారు.ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు ఎస్ఎఫ్ వో ఆర్ సత్యనారాయణ, లీడింగ్ ఫైర్ మ్యాన్ బి రవికుమార్, డీవోపీ డీ ప్రభాకర్, ఫైర్ మ్యాన్ వేణుగోపాల్, స్థానిక యువకులు జనగాం శ్రీనివాస్, న్యాయవాది మాసు సుధాకర్, దుర్గం గణేష్, కోట సంజయ్, రామటెంకి అజయ్‌ను స్థానికులు అభినందించారు.