హాజీపూర్, నవంబర్ 25 : ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని బెటాలియన్స్ డీఐజీ షర్ఫొద్దీన్ సిద్ధీఖీ పేర్కొన్నారు. సోమవారం గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్‌ను సోమవారం తనిఖీ చేశారు. డీఐజీకి బెటాలియన్ కమాండెంట్ వెంకట్రాములు స్వాగతం పలికి పూల బొకే అందజేశారు. అనంతరం పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. వార్షిక తనిఖీలో భాగంగా బెటాలియన్‌లోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీ అనంతరం బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.