బోథ్, ఆగస్టు 25 : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం చింతల్బోరి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దగూడకు చెందిన మండాడి రేణుక బోథ్ సీహెచ్సీలో ఈనెల 21న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం సీహెచ్సీ నుంచి పెద్దగూడ గ్రామానికి 102 వాహనంలో బయలుదేరింది. గ్రామానికి ఆనుకొని వాగు ఉండడంతో సిబ్బంది సహాయంతో వాగు దాటింది.
వంతెన లేకపోవడంతో తాము అష్టకష్టాలు పడుతున్నామని, వైద్య సేవలకు నోచుకోలేక పోతున్నామని పెద్దగూడ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 102 పైలెట్ భగత్ నవీన్ కుమార్, బాలింతతోపాటు శిశువును వారి ఇంటికి చేర్చారు.