చింతలమానేపల్లి : మండలంలోని లంబడిహెట్టి గ్రామానికి చెందిన సంత్ సేవలాల్ ( Sevalal ) దీక్ష స్వాములు, భక్తులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.లంబడిహెట్టి నుంచి బాబాపూర్ మీదుగా రవీంద్రనగర్ వరకు ర్యాలీ చేపట్టారు. సుమారు 130 మంది సేవలాల్ భక్తులు మహారాష్ట్ర (Maharashtra) లోని వాసిం జిల్లా బంజారా కాశీ పౌరదేవికి ( Banjara Kashi) బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా సేవలాల్ దీక్ష స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆదివారం దీక్ష మాల విరమణ చేయనున్నట్టు తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ దీక్షలు ప్రతి ఏటా గ్రామంలో 50 మందికి పైగా మాలలు వేసుకుంటున్నట్లు చెప్పారు. రవీంద్రనగర్‌లో భక్తులకు మాజీ జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి వెంకయ్య ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.