రెబ్బెన : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ( Rebbena ) మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువుదీరిన కనకదుర్గాదేవి స్వయంభు మహాంకాళి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Navaratri Celebrations ) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు దుర్గమ్మ తల్లి శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు,అన్నదానం చేయగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతి గౌడ్ పర్యవేక్షించారు.